Fentanyl: భారతీయ కంపెనీలపై అమెరికాలో అభియోగాలు..! 1 d ago
ఫెంటనిల్ రసాయనాన్ని దిగుమతి చేయడం, పంపిణీ చేయడం వల్ల రెండు భారతీయ కంపెనీల పై అమెరికాలో అభియోగాలు నమోదయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ రసాయనాన్ని, విదేశాలకు, ముఖ్యంగా అమెరికాకు, మెక్సికోకు సరఫరా చేస్తున్నట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వెల్లడించింది. గుజరాత్‌కు చెందిన రక్సూటర్, అధోస్ కెమికల్ కంపెనీలు ఈ ఆరోపణలు ఎదుర్కొనడం ఇదే మొదటిసారి. ఈ కేసులో రక్సూటర్ కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్ భవేశ్ లథియాను జనవరి 4న అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు నిజమైతే భవేష్ కు 53 నవత్సరాలు జైలు శిక్షపడే అవకాశం ఉందని తెలుస్తుంది.
అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రధాన ప్రచారకర్తగా మారిన అంశాల్లో ఫెంటనిల్ ఒకటి. కేంద్ర నాడీవ్యవస్థపై పనిచేసే ఈ నొప్పి నివారిణిని హెరాయిన్ కంటే 50 శాతం రెట్లు శక్తిమంతమైందని నిపుణులు తెలిపారు. రెండు మిల్లీ గ్రాముల డోసు కూడా ప్రాణాంతకమని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనికి బానిసలుగా మారిన కొందరు తప్పుడు చీటీలతో ఔషధ దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించారు. దీనిని ఇతర మాదక ద్రవ్యాలతో కలిపి కూడా వాడుతున్నట్లు వివరించారు.
ఆరోగ్య సమస్యల్లో నొప్పి నివారిణిగా వినియోగించే ఫెంటనిల్ ను ఒకప్పుడు ఆస్పత్రుల బయట ఉపయోగించేవారు కాదు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగావాడడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఇది మెక్సికోలోని క్రిమినల్ గ్యాంగ్ ల చేతిలో పడటమే దీనికి ప్రధాన కారణంగా పేర్కొంది. చైనా చాలా చౌకగా దీనిని తయారుచేసి వివిధ మార్గాల్లో అమెరికాకు తరలిస్తుందనే ఆరోపణలు కూడా వున్నాయి.